Sat. Nov 23rd, 2024

కేనోపనిషత్ : కేనేషితం పతతి

ఓమ్ కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణః ప్రథమః ప్రైతి యుక్తః,
కేషితాం వాచమిమాం వదన్తి చక్షుః శ్రోత్రం క ఉ దేవో యునక్తి || 1 ||

తా|| మనస్సు దేనిచే లేదా ఎవనిచే ప్రేరితమై ,దేని లేదా ఎవని ఇష్టము ప్రకారము తన విషయముల వైపు ప్రవర్తించుచున్నది? ప్రథమ ప్రాణము దేనిచే లేదా ఎవనిచే ప్రేరితమై తన కర్తవ్యమును చేయుచున్నది? దేని లేదా ఎవని ఇష్టము ప్రకారము వాక్కు ప్రవర్తించుచున్నది? చక్షురింద్రియమును తన తన పనులు చేయునట్లు ప్రేరేపించునది ఎవరు?

వి|| అన్ని విధములగు చలనములకును ప్రాణమే నిమిత్తము , అందుచే దానికి ప్రథమప్రాణము అని పేరు.

Related Post