లోకములో మృదువైన మంచి మృత్తికతో చేయబడిన ఏనుగును బాలుడు చేతతీసుకుని అది వాస్తవమైన ఏనుగు కాకపోయినప్పటికిని వాస్తవమైన ఏనుగు అని అభిమానించి అనేకవిధములైన ఆటలను ఆడుచున్నాడు. ఇచ్చట బాలుడు ఆటలాడుట మిథ్యాభిమానమే కదా? అటువలెనే ఆత్మకును దేహేంద్రియాదులకు కలిగియున్న భేదమునెరుంగజాలని మూర్ఖుడు వాస్తవముగా దేహేంద్రియాదులు లేని ఆత్మయందు దేహేంద్రియాదులు కలవని మిథ్యాభిమానమును చేసి అందున నానావిధకర్మలను ఆచరించుచుండును అని భావము.