Wed. Oct 16th, 2024

వివేకచూడామణిః – ఆత్మచిన్తనవిధానమ్ ।

చిత్తమూలో వికల్పోఽయం చిత్తాభావే న కశ్చన ।
అతశ్చిత్తం సమాధేహి ప్రత్యగ్రూపే పరాత్మని ॥ 408 ॥

భేదబుద్ధి బహిర్ముఖము అయిన మనస్సే మూలముగా కలది. చిత్తములేని సుషుప్త్యవస్థలో భేదబుద్ధి ఏదియూ లేదు. కావున అవిద్య స్వరూపముచే ఉన్ననూ చిత్తము లేనప్పుడు తన కార్యమును చేయజాలదు. ఆ అవిద్య జాగ్రత్స్వప్నావస్థలలో చిత్తరూపమున పరిణమించుచు ప్రపంచమును జనింపచేయు చున్నది. ఆ కారణము వలన చిత్తమును ప్రత్య గ్రూపమైన పరాత్మయందు నిలుపుము . అప్పుడు అవిద్యతో పాటు వికల్పములన్నియూ బాధితములు అగును.

Related Post